కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మెగాస్టార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి రాజకీయాలకు దూరమంటున్నారు, పార్టీలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రుద్...
షారూక్ ఖాన్ సినిమాను బైకాట్ పఠాన్ అంటూ నెటిజన్లు ట్రెండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలోని బేషరమ్ రంగ్ పాటపై దేశవ్యాప్తంగా నిరసనలు, సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. సినిమాను నిషేదించాలని, పాటలో సీన్‌ను తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. గతంలోను ఇతర నటుల సినిమాలకు బైకాట్ దెబ్బ తగిలింది. ఈ నేపథ్యం...
బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాహుబలి టైంలోనే కమిట్ అయ్యాడు కాబట్టి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ చిత్రాలున్నాయి. వాటిలో బాహుబలి రేంజ్ హిట్ ఇచ్చేది కేవలం ‘సలార్’ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్ చాప్టర్ 2’...
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్.. ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇటీవలె స్క్రిప్టు రాయడం స్టార్ట్ చేశారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేం. కానీ రోజు రోజుకి ఈ సినిమా పై వస్తున్న హైప్ చూసి.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోతోంది. మిగతా హీరోల ఫ్యాన్స్ అయితే.. ఇదేం హైప్‌రా బాబు.. అంటూ మహేష్ ఫ్యాన్స్‌ను అడుగుతున్నారు. రాజమౌళి నోటి నుంచి SSMB 29 గురించి ...
ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్యతో మాత్రం.. ఘోర పరాజయాన్ని అందున్నాడు. ఈ సినిమాతో మెగాస్టార్ ఇమేజ్‌కు భారీ డ్యామేజ్ జరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ కూడా మెగాస్టార్ ఇమేజ్‌కు సరిపోలేదు. హిట్ టాక్ వచ్చినప్పటికీ.. మళయాళ రీమేక్ సినిమా కావడంతో.. కనెక్ట్ కాలేకపోయారు. అందుకే వాల్త...
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’.. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ని అందుకోని దుమ్ములేపింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో140 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. ఈ లెక్కన వీరయ్య భారీ లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు. ఇక యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మైత్రీ మూవీ మ...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరి ఎవరంటే ఇప్పటికీ అందరూ అలనాటి తార శ్రీదేవి పేరే చెబుతారు. ఆమె తర్వాత అంతటి అందాన్ని మూటగట్టుకున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. బాలీవుడ్ లో దఢక్ సినిమాతో జాన్వీ కవూర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ జాన్వీకి మంచి క్రేజ్ వచ్చింది. శ్రీదేవి కూతురిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందని చెప్పాలి. తాజాగా జాన్వీ కపూర్ తన ల...
‘బిచ్చగాడు’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాపులారిటీని సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోనీ ఓ బోట్ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. మలేషియాలో ‘బిచ్చగాడు-2’ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ...
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై రూపొందిస్తున్నారు. మురళి కిశోర్ అబ్బూరు ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కశ్మీర పరదేశి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘ఓ బంగారం నీ చేయి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం అంటూ సా...
బాలీవుడ్ లో తరచూ ఫిట్ నెస్ గురించి చర్చించే సెలబ్రిటీల్లో హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఒకరు. ఈ పొడుగుకాళ్ల సుందరి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫిట్ నెస్ గురించి పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. శిల్పా శెట్టి షేర్ చేసే యోగాసనాల్లో కొన్ని సంప్రదాయ భంగిమలు భిన్నంగా ఉంటాయి. తాజాగా ఆమె వెన్నెనొప్పి తగ్గించుకునేందుకు ఓ యోగాసనం గురించి తెలియజేసింది. https://www.instagram.com/reel/Cndnm3zhax3/?utm_sour...
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ మాళవిక శర్మకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ రవితేజతో కలిసి నేలటిక్కెట్ అనే సినిమాతో తెలుగు తెరపై కనిపించింది. ఆ సినిమాలో బ్యూటిఫుల్ లుక్స్ తో కుర్రకారు మనసును దోచుకుంది. మాళవిక శర్మ తన అందంతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాదు తన డ్యాన్స్, నటనతో మంచి మార్కులే సాధించింది. ఆ తర్వాత ఈమె రెడ్ అనే సినిమాలో రామ్ సరసన కనిపించింది. అయితే ఈ సినిమాలో [...
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. నేడు ఆమెను అంధేరీ కోర్టులు పోలీసులు హాజరుపరచనున్నారు. రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఓ మహిళా మోడల్ ను అవమానపరిచే విధంగా చేసిన వీడియో, ఫోటో కొంత కాలంగా వైరల్ అయ్యిందని రాఖా సావంత్ పై ఆరోపణలు ఉన్నాయి. షెర్లిన్ చోప్రా ఫిర్యాదు మేరకు రాఖీ సావంత్ ను [&h...
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలను ఆర్ఆర్ఆర్ లో అద్భుతంగా చూపారంటూ ప్రత్యేక ప్రశంసలను అందుకున్నారు. ఈ సినిమా అటు హాలీవుడ్ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డులు సైతం దక్కాయి. ఆస్కార్ తర్వాత అత్యున్నత అవార్డుగా గుర్తింపు పొందిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చింద...
టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రముఖ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరును. ‘గాండీవధారి అర్జున’ అని ఖరారు చేశారు. టైటిల్ తో పాటుగా హీరో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే వరుణ్ తేజ్ సినిమా పక్కా యాక్ష...
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలె ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెట ప్రాంతంలో ఆయనకు సొంత ఫిలిం స్టూడియో ఉండటం వల్ల ఎక్కువగా అక్కడ గడుపుతుంటారు. ఈ స్టూడియోలో రెగ్యులర్ గా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. తాజాగా ఈ ఫిలిం స్టూడియోలో ప్రమాదం చోటుచేసుకుంది. ఏఆర్ రెహమాన్ ఫిలిం స్టూడ...