టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ మాళవిక శర్మకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ రవితేజతో కలిసి నేలటిక్కెట్ అనే సినిమాతో తెలుగు తెరపై కనిపించింది. ఆ సినిమాలో బ్యూటిఫుల్ లుక్స్ తో కుర్రకారు మనసును దోచుకుంది.
మాళవిక శర్మ తన అందంతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాదు తన డ్యాన్స్, నటనతో మంచి మార్కులే సాధించింది.
ఆ తర్వాత ఈమె రెడ్ అనే సినిమాలో రామ్ సరసన కనిపించింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఆమె హావభావాలు, అందం, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తెలుగులో ఆ రెండు సినిమాల్లో మాళవిక శర్మ మెరిసింది. తాజాగా ఆమె ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా మాళవిక శర్మ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో మాళవిక శర్మ మరింత అందంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.