బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. నేడు ఆమెను అంధేరీ కోర్టులు పోలీసులు హాజరుపరచనున్నారు. రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఓ మహిళా మోడల్ ను అవమానపరిచే విధంగా చేసిన వీడియో, ఫోటో కొంత కాలంగా వైరల్ అయ్యిందని రాఖా సావంత్ పై ఆరోపణలు ఉన్నాయి. షెర్లిన్ చోప్రా ఫిర్యాదు మేరకు రాఖీ సావంత్ ను అంబోలి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు.
రాఖీ సావంత్ అరెస్ట్ విషయాన్ని షెర్లిన్ చోప్రా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. షెర్లిన్కు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను వైరల్ చేస్తానని రాఖీ బెదిరించిందని, అందుకే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ తెలిపింది. కాగా గురువారం మధ్యాహ్నం రాఖీ తన డ్యాన్స్ అకాడమీని ప్రారంభించనున్న నేపథ్యంలో పోలీసులుఆమెను అరెస్ట్ చేయడం కలకలం రేపింది.