తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరి ఎవరంటే ఇప్పటికీ అందరూ అలనాటి తార శ్రీదేవి పేరే చెబుతారు. ఆమె తర్వాత అంతటి అందాన్ని మూటగట్టుకున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. బాలీవుడ్ లో దఢక్ సినిమాతో జాన్వీ కవూర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు.
ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ జాన్వీకి మంచి క్రేజ్ వచ్చింది. శ్రీదేవి కూతురిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందని చెప్పాలి.
తాజాగా జాన్వీ కపూర్ తన లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె అందాలు యూత్ కళ్లను తిప్పుకోనివ్వడం లేదు. క్రీమ్ కలర్ డ్రెస్ లో జాన్వీ అందాల జలపాతంలాగా విరబూసిన విరజాజి వనంలాగా చూపులు తిప్పుకోనివ్వడం లేదు.
అందానికే అసూయ పుట్టించేలా ఉన్న జాన్వీ కపూర్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. జాన్వీ త్వరలోనే తెలుగు సినిమాలో నటించే అవకాశం ఉంది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో ఆమె నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.