బాలీవుడ్ లో తరచూ ఫిట్ నెస్ గురించి చర్చించే సెలబ్రిటీల్లో హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఒకరు. ఈ పొడుగుకాళ్ల సుందరి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫిట్ నెస్ గురించి పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. శిల్పా శెట్టి షేర్ చేసే యోగాసనాల్లో కొన్ని సంప్రదాయ భంగిమలు భిన్నంగా ఉంటాయి. తాజాగా ఆమె వెన్నెనొప్పి తగ్గించుకునేందుకు ఓ యోగాసనం గురించి తెలియజేసింది.
శిల్పాశెట్టి బర్డ్ పోజుని షేర్ చేస్తూ పలు విషయాలను తెలియజేసింది. కూర్చొని ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుంటారని, అలాంటి వారి కోసం తాను ప్రత్యేక వ్యాయామాన్ని సూచించింది. శిల్పా శెట్టి తాజాగా షేర్ చేసిన పక్షి-కుక్క భంగిమ వ్యాయామం చాలా ఉపయోగకరమైంది. శిల్పా షేర్ చేసిన వ్యాయామం భుజాలు, చేతులను బలపరిచి వెన్నెముక నొప్పి లేకుండా చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం శిల్పా శెట్టి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.