టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రముఖ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరును. ‘గాండీవధారి అర్జున’ అని ఖరారు చేశారు. టైటిల్ తో పాటుగా హీరో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
పోస్టర్ చూస్తుంటే వరుణ్ తేజ్ సినిమా పక్కా యాక్షన్ సినిమాగా తెలుస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్ లో ఇది పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా నిలువనుంది. ఈ చిత్రానికి మిక్కిజే మేయర్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. మూవీలో వరుణ్ తేజ్ కు జోడిగా ఎవరు నటిస్తున్నారో ఇంత వరకూ ప్రకటించలేదు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.