యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై రూపొందిస్తున్నారు. మురళి కిశోర్ అబ్బూరు ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కశ్మీర పరదేశి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘ఓ బంగారం నీ చేయి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రాశారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదిన ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.