నిన్న రష్మిక.. నేడు కాజోల్.. డీప్ ఫేక్ వీడియోలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ఓ ఇన్ ఫ్లూయెన్సర్ బట్టలు మార్చుకునే వీడియోకు ఏఐ సాయంతో కాజోల్ మొహం పెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
యానిమల్ మూవీ హీరోయిన్ రష్మిక మందన్న ఇటివల సోషల్ మీడియాలో రికవరీ చాలా ముధ్యమని ఓ ట్వీట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ రష్మికకు ఏమైందోనని కంగారు పడుతున్నారు. అనేక మంది ట్వీట్లు చేస్తుండటంతో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుల్లో గౌతమ్ మీనన్ కూడా ఒకరు. ఆయన తాజా చిత్రం ధృవ నక్షత్రం చిత్రాన్ని 24న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో విక్రమ్, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, పార్తిబన్, అర్జున్ దాస్ తదితరులు నటించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. అంతేకాదు.. సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్‌తో సందడి చేస్తున్నాడు. త్వరలో క్లాస్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్న నాని.. ఇప్పుడు మళ్లీ మాస్ బాట పట్టాడు.
కెజియఫ్ హీరో యష్(yash) చేసిన కొన్ని కామెంట్స్.. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. యష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. అసలు ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? అనేది అంతు బట్టకుండా ఉంది.
పది వారాలు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఈ వారం జరిగే నామినేషన్లో మాములు రచ్చ చేయలేదు. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఆ క్రమంలో యావర్‌కు అమర్‌కు మధ్య జరిగిన గొడవ పతాక స్థాయికిి చేరుకుంది. మరి ఈ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారో చూడాలి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. నవంబర్ 1న వీరి పెళ్లి ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. కానీ ఇప్పటి వరకు అత్తారింటికి వెళ్లలేదు వరుణ్ తేజ్. అందుకే తాజాగా అత్తారింట్లో అడుగుపెట్టాడు.
ఆర్ఎక్స్ 100తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఈ మూవీ తర్వాత మహాసముద్రం మూవీతో వచ్చాడు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని ఆయన ఫిక్స్ అయ్యారు. తన తొలి సినిమా హిట్ కావడానికి కారణమైన పాయల్ రాజ్ పూత్ తో కలిసి మంగళవారం మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. కాగా ఈ మూవీకి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మెయిన్ పిల్లర్ గా మారారు.
నందమూరి నటసింహం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది అన్‌స్టాపబుల్ టాక్ షో. ప్రస్తుతం థర్డ్ సీజన్ నడుస్తోంది. అందులో భాగంగా సెకండ్ ఎపిసోడ్‌లో యానిమల్(animal team) చెప్పిన బాలయ్య డైలాగ్ హైలెట్ కానుందని అంటున్నారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) గురించి అందరికీ తెలిసిందే. సినిమా కోసం ఏదైనా చేయడంలో దాస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. అలాంటి దాస్‌కు షూటింగ్‌లో గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి మాస్ కా దాస్‌కు ఎలా ఉంది?
టైగర్ 3 మూవీ మొదటి మూడు రోజుల్లోనే సరికొత్త రికార్డును సాధించింది. ఈ చిత్రం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో షారూఖ్ ఇటివల చిత్రాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ రికార్డు బ్రేక్ చేసింది.
గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్ కార్తీక నాయర్ తనకు కాబోయే వరుడిని పరిచయం చేసింది. ఇటివలనే నిశ్చితార్థం చేసుకున్న ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన కాబోయే భర్త రోహిత్ మీనన్ ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులకు పరిచయం చేసింది. ఇవి చూసిన ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.