బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. అంతేకాదు.. సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్‌తో సందడి చేస్తున్నాడు. త్వరలో క్లాస్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్న నాని.. ఇప్పుడు మళ్లీ మాస్ బాట పట్టాడు.
ఓ మాస్ సినిమా, ఓ క్లాస్ సినిమా అంటూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ‘దసరా’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్న నాని.. వెంటనే క్లాస్ లుక్‌లోకి వచ్చేశాడు. దసరాలో రగ్గ్డ్గా ఊరమాస్‌గా కనిపించిన నాని.. హాయ్ నాన్న సినిమా కోసం క్లాస్ లుక్‌లోకి వచ్చేశాడు. శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ.. తండ్రి, కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన హాయ్ నాన్న టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది.
ఇక హాయ్ నాన్న పనైపోయింది కాబట్టి.. ఏ మాత్రం గ్యాప్ లేకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టేశాడు నాని. ‘అంటే సుందరానికి’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే.. ‘అంటే సుందరానికి’ సినిమాతో క్లాస్‌గా ట్రై చేసిన ఈ కాంబో.. సరిపోదా శనివారంతో మాస్ సినిమా ట్రై చేస్తున్నారు. నాని ఈ సినిమాతో మళ్లీ మాస్ మోత మోగించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్‌తో షూటింగ్ స్టార్ట్ చేసినట్లుగా తెలిపారు మేకర్స్.
ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ కూడా షూట్ చేయనున్నారు. దీంతో నాని.. మరోసారి మాస్ ఆడియెన్స్‌ను ఎలా మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. మరి సరిపోదా శనివారం ఎలా ఉంటుందో చూడాలి.