»Unstoppable 3 Ranbir Kapoor Balaiah Dialogue Animal Team
Unstoppable3: బాలయ్య డైలాగ్ చెప్పిన యానిమల్?
నందమూరి నటసింహం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది అన్‌స్టాపబుల్ టాక్ షో. ప్రస్తుతం థర్డ్ సీజన్ నడుస్తోంది. అందులో భాగంగా సెకండ్ ఎపిసోడ్లో యానిమల్(animal team) చెప్పిన బాలయ్య డైలాగ్ హైలెట్ కానుందని అంటున్నారు.
Unstoppable 3 ranbir kapoor Balaiah dialogue animal team
రీసెంట్గా అన్‌స్టాపబుల్ థర్డ్ సీజన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్(Unstoppable 3) లిమిటెడ్ ఎడిషన్ పేరుతో.. భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లతో ఫస్ట్ ఎపిసోడ్ బయటికి వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్‌కు రంగం సిద్ధమైంది. అయితే.. ఇప్పటి వరకు తెలుగు సెలబ్రిటీస్, పొలిటీషియన్స్‌తో షో చేసిన బాలయ్య.. ఫస్ట్ టైం బాలీవుడ్ హీరోతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్‌లిమిటేడ్ ఎడిషన్ సెకండ్ ఎపిసోడ్‌కు యానిమల్ చిత్ర యూనిట్ వచ్చినట్టుగా ఇప్పటికే అనౌన్స్ చేశారు ఆహా వారు. రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ సినిమా(animal team)ను.. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేశాడు.
డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. తెలుగు ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. హీరో రణబీర్(ranbir kapoor)తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ షోలో అడుగు పెట్టారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేశారు. కొన్ని ఫొటోలు కూడా రిలీజ్ అయ్యాయి. దీంతో ఈ ఎపిసోడ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. ఈ షోలో రణ్‌బీర్ చెప్పిన బాలయ్య డైలాగ్ ఒకటి హైలెట్‌గా నిలవనుందట. ‘ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’ అనే డైలాగ్ చెబుతూ రణబీర్ షోలోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయిందట. మరి రణ్‌బీర్‌తో బాలయ్య ఎలా సందడి చేశాడో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.