మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతున్న ఈ సినిమాలో మహేష్ తల్లిగా రమ్యకృష్ణ నటించారు. గతంతో వీరిద్దరు కలిసి ఓ ఐటమ్ సాంగ్ చేశారు. ఇప్పుడు తల్లీకొడుకులుగా నటిస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ పై భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సడెన్ సర్ప్రైజ్ ఇస్తూ కల్కి టీజర్ రిలీజ్‌కు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ కట్ చేసినట్టుగా సమాచారం.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ మధ్య కాలంలో తెలుగులో ఓ చిన్న సినిమా ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సాలిడ్ సౌండ్ చేస్తోంది. జస్ట్ ప్రీమియర్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ గుంటూరు కారం సందడి స్టార్ట్ అయిపోయింది. జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి.. రిలీజ్‌కు ఓ రోజు ముందు మేకింగ్ వీడియో రిలీజ్ చేయగా అదిరిపోయింది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా వస్తున్న కంగువపై ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో సినిమా అంటే డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే త్వరలో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రానున్నట్లు సమాచారం.
టాలీవుడ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య వార్‌తో థియేటర్ల గొడవ రోజురోజుకి వేడెక్కుతుంది. మైత్రీ మూవీస్ నైజాంలో హనుమాన్ హక్కులను కొనుగోలు చేయగా.. దిల్ రాజు గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ అనే మూడు సినిమాలను కొనుగోలు చేశారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ విషయంలో తమన్ అనవసరంగా టార్గెట్ అయ్యాడు.
అవిక గోర్, నందు, బిగ్‌బాస్ అలి ప్రాధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ వధువు. పెళ్ళి చేసుకొని అత్తగారింటికి వచ్చిన ఇందుకు ఆ ఇంట్లో అన్ని వింతగా అనిపిస్తాయి. చివరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టి చూసేలా ఉండే ఈ సిరీస్ పూర్తి ఎక్స్ ప్లనేషన్ మీ కోసం.
పుష్ప2 ఐటెం బ్యూటీ ఫిక్స్ అయిందా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ఆ ముద్దుగుమ్మ షూటింగ్ సెట్‌లో ల్యాండ్ అయిపోయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పుష్పరాజ్‌తో ఊ.. అన్నది ఎవరు?
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ ఫిల్మ్ సైంధవ్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విరాట్ కోహ్లీ మరదలు కూడా నటిస్తుందా? అంటే, ఔననే చెప్పాలి. ఈ విషయాన్ని స్వయంగా ఆ ముద్దుగుమ్మనే చెప్పింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు మరో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు. స్పై యూనివర్స్‌లోభాగంగా వార్2 భారీ ఎత్తున రాబోతోంది. తాజాగా హృతిక్‌కు బర్త్ డే చేస్తూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం గత సంవత్సరం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తాజాగా అరుదైన రికార్డు సృష్టించింది. ఒక థియేటర్లో 365 రోజులు పూర్తి చేసుకోబోతుంది.
మాస్ మహారాజాను మోసం చేశారా? అంటే, ఔననే మాట వినిపిస్తోంది. సంక్రాంతికి రావాల్సిన మాస్ రాజా 'ఈగల్' సినిమాను పట్టుబట్టి మరీ ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేశారు. సోలో రిలీజ్ అంటూ ఊరించారు. కానీ ఇప్పుడు రవితేజకు పోటీగా మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.