»Waltheru Veeraiah 365 Days In Krishna District Chiranjeevi Thanked The Fans
Waltair Veerayya 365 Days ఎక్కడో తెలుసా?
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం గత సంవత్సరం సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తాజాగా అరుదైన రికార్డు సృష్టించింది. ఒక థియేటర్లో 365 రోజులు పూర్తి చేసుకోబోతుంది.
Waltheru Veeraiah 365 days in Krishna district. Chiranjeevi thanked the fans
Waltair Veerayya 365 Days: మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య(Waltair Veerayya ) తాజాగా మరో రికార్డును సృష్టించింది. ఎంత మంచి సినిమా అయినా రెండు వారాలకు మించి నిలబడి ఈ సమయంలో వాల్తేరు వీరయ్య 365 రోజులు ఒక థియేటర్లో ప్రదర్శించబడుతుంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా విడుదలైంది. అప్పటి నుంచి 2024 సంక్రాంతి వరకు కృష్ణాజిల్లా అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్లో ఆడుతుంది. దీనిపై తాజాగా చిరంజీవి స్పందించారు. ఈ రోజుల్లో ఇన్ని రోజులు ఒక సినిమా ఆడడం అంటే అది మాములు విషయం కాదన్నారు. దీనికి కారణం అయిన ఆభిమానులు ఆయన దన్యవాధాలు తెలిపారు.
ఒక దశాబ్ధం క్రితం ఇలాంటి నెంబర్లు వినబడేవి. ఏ హీరో సినిమా ఎక్కువ రోజులు ఆడితే అంత గొప్ప. నేటి పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇప్పుడు కేవలం కలెక్షన్లు మాత్రమే రికార్డులను కొలమానం. అలాంటిది ఒక సంవత్సర కాలం పాటు సినిమా రన్ అవుతుందంటే ఇది నిజంగా ఈరోజుల్లో అరుదైన రికార్డే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్‌లా పనిచేసింది. చిరుతో పాటు మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించడం మరో విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించారు. ఇక చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠతో ఓ సోషియో ఫ్యాంటసీ చిత్రం తెరకెక్కిస్తున్నారు. దానికి విశ్వంభర అనే పేరును పరశీలిస్తున్నట్లు మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.