దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు కమ్మేసింది. దీంతో ఇక్కడి విమానాశ్రయంలో పలు సర్వీసుల్లో ఆలస్యం ఏర్పడింది. ఇండిగో, ఇతర విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో జాప్యం ఏర్పడింది. మోదీ ఇవాళ మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజులపాటు విదేశీ పర్యటన చేయనున్నారు.