TG: టోలిచౌకి పీఎస్ పరిధిలోని పారమౌంట్ కాలనీలో షాకింగ్ ఘటన జరిగింది. మార్వ డెంటల్ ఆస్పత్రి సమీపంలో ఇర్ఫాన్(24) అనే యువకుడిని బిలాల్ అనే వ్యక్తి పొడిచి చంపాడు. ఇర్ఫాన్ తమ్ముడు అదనాన్కు, బిలాల్‌కు మధ్య గొడవ జరగడంతో ఇర్ఫాన్ గొడవను ఆపేందుకు ప్రయత్నించగా.. బిలాల్ నేరుగా ఇర్ఫాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇర్ఫాన్ మృతి చెందినట్లు సమాచారం.