KNR: మూడో విడత ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఉందని ఇల్లందకుంట తహసీల్దార్ రాజమల్లు తెలిపారు. 144 సెక్షన్ ప్రారంభమవుతుందని, ప్రజలు గుంపులుగుంపులుగా ఉండకూడదని ఆయన సూచించారు. 48 గంటల పాటు మద్యం షాపులు బంద్ చేయాలన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక పనులు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.