ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ వచ్చేసింది. తెలుగు పరిశ్రమ ఎప్పుడు చూడని కొత్త ప్రపంచాన్ని చూడడానికి సిద్ధం అవమని అధికారిక పోస్ట్ విడుదల చేశారు మేకర్స్.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ నటించిన పాన్-ఇండియన్ చిత్రం హనుమాన్. మొదటి నుంచి ఈ మూవీపై మంచి బజ్ ఉంది. దానికి తోడు ప్రమోషన్స్, కొన్ని వివాదాలు మూవీకి మరింత హైప్ తీసుకువచ్చాయి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
డైరక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబోలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఈ చిత్రంలో హరోయిన్‌గా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, గెటప్ శ్రీను వంటివారు కూడా నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తేజ సజ్జా సూపర్ హీరోగా మెప్పించాడా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
పొలిమేర 1 విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా పొలిమేర 2 వచ్చింది. పార్ట్ 1 లో చేతబడి చేసి చంపిన కొమురయ్య పారిపోతాడు. అక్కడినుంచి పార్ట్ 2 మొదలౌతుంది. చేతబడి పేరుతో జరిగే అనుమానపు హత్యలన్నింటికి సమాధానాలు కావాలి, న్యాయం కావాలి అనే కొమురయ్య తమ్ముడు జంగయ్య కోర్టులో కేసువేస్తాడు. అక్కడి నుంచి ఈ కథ సాగుతుంది.
సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి. నిజానికి.. వాటిలో హనుమాన్ చిన్న సినిమానే కానీ.. వారి కాన్ఫిడెన్స్. మూవీలోని కంటెంట్ దానిని పెద్ద సినిమాగా చేసేశాయి. అయితే.. ఈ మూవీపై ఎంత పాజిటివ్ వైబ్ ఉన్నా... సింపతీ డ్రామా ఆడుతోందని వార్తలు కూడా వినపడుతున్నాయి.
మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా కోసం చాలా మంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అడ్వాన్స్ బుకింగ్‌లో గుంటూరు కారం రికార్డులు బ్రేక్ చేస్తుంది.
నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం అన్నపూర్ణి. ఈ చిత్రం ప్రస్తుతం వివాదంలో ఉంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఈ సినిమాని ఓటీటీ నుంచి తొలగించారు.
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రంపై దాఖలైన పిటీషన్ల మీద నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలువరించనుంది.
సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ , నాగార్జున నా సామిరంగ చిత్రాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాల పాటలు సందడి చేయలేదు.
సౌత్ సినిమా లేడీ స్టార్ నయనతార నటించిన 'అన్నపూర్ణి' సినిమా వివాదాల్లో కూరుకుపోయింది. ఈ సినిమాను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇందులో శ్రీరాముడు ‘మాంసాహారుడు’గా వర్ణించబడ్డాడు.
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'తమ్ముడు' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. నితిన్‌కు గాయాలు అవడంతో.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారట.
ఘట్టమనేని అభిమానులకు రెండు రోజుల ముందే సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. 12వ తేదీ అర్థరాత్రి నుంచే గుంటూరు కారం షోష్ స్టార్ట్ కానున్నాయి. ఇప్పటికే ఓ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. జస్ట్ బుకింగ్స్‌తోనే బాక్సాఫీస్ బద్దలు చేస్తున్నాడు మహేష్ బాబు.
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా ప్రజెంట్ చేస్తు సుకుమార్ చేసిన పుష్ప మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. పుష్ప2 రిలీజ్ పై ఉన్న డౌట్స్‌కు చెక్ పెట్టేశారు మేకర్స్.
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. పాన్ ఇండియా మూవీగా బజ్ జనరేట్ చేస్తోంది. అసలు ఈ సినిమా క్రేజ్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. ఇక ఫస్ట్ రివ్యూలు కూడా వచ్చేశాయి. దీంతో హనుమాన్ అద్భుతమే అంటున్నారు.