ఈసారి సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఏకంగా నాలుగు సినిమాలు దూసుకొస్తున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా సాలిడ్ బజ్‌తో థియేటర్లోకి రాబోతున్నాయి. మరి ఈ సినిమాల రన్ టైం ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సలార్ మూవీ.. ఎట్టకేలకు 700 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది. దీంతో ప్రభాస్ మరో సరికొత్త రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు-త్రివిక్రమ్ మూడోసారి కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఈసారి మాస్ తప్ప మెసేజులు లేవమ్మా.. అంటూ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. దీంతో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈవెంట్ విషయంలో మహేష్ స్పెషల్ పోస్ట్ చేశారు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడారు.
ఫాలిమి సినిమా చంద్రన్ కుటుంబానికి సంబంధించిన భావోద్వేగాల కథ. కుటుంబంలో నలుగురు భిన్న మనస్థత్వవాలు ఉన్నవారు. వీరితో పాటు జనార్దన్ అనే వృద్దుడు చంద్రన్ తండ్రి. కాశికి వెళ్లాలనేది ఆయన అంతిమ కోరిక. ఇంట్లోవాళ్లకు చెప్పకుండా మూడు సార్లు ప్రయత్నం చేసి దొరికిపోతాడు. దాంతో ఎప్పటికైనా నిన్ను కాశికి తీసుకెళ్తా అని మనువడు అనుప్ అంటాడు. ఇక తండ్రి చంద్రన్ తన సొంత బిజినెస్ ప్రింటింగ్ ప్రెస్ మూసేసిన తరువాత ఏ ప...
ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేవర గ్లింప్స్ గుంటూరు కారం సినిమాను పక్కకు తోసి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
విజయ్ సేతుపతి హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇకపై విలన్ పాత్రలు చేయనని సమాచారం. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ చిత్రం ట్రైలర్ విడుదల అయింది. రెండు ఊర్ల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో కామెడీ, యాక్షన్ డ్రామ పుష్కలంగా కనిపిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచుకోడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే అర్థ రాత్రి షోలకు కూడా అనుమతి ఇచ్చింది.
సంక్రాంతి లాంటి సీజన్ వస్తే.. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ అవుతున్నాడు. థియేటర్ల విషయంలో దిల్ రాజు పై ఎక్కడాలేని ఆరోపణలు వస్తుంటాయి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఊరుకున్నాను కానీ.. ఇక పై సహించేది లేదని దిల్ రాజు సీరియస్ అయ్యాడు. ఇక ఇప్పుడో షాకింగ్ వీడియో ఒకటి బయటికొచ్చి ట్రెండ్ అవుతోంది.
కెజియఫ్ హీరో యశ్ అందరికీ తెలిసిందే. కెజియఫ్‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న యష్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే జనవరి 8న 38వ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నాడు యశ్. కానీ ఈసారి బర్త్ డే వేడుక యశ్‌ను భయపట్టేలా చేసింది.
ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సంక్రాంతికి థియేటర్ల కేటాయింపుపై చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దిల్ రాజు హనుమాన్ సినిమాకు సరిపడా థియేటర్లు ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ పవర్ స్టార్ లాంటి స్టార్ హీరో సినిమాతో గత రెండు మూడేళ్లుగా లాక్ అయిపోవడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఈ గ్యాప్‌లో కనీసం ఒక్క సినిమా అయిన కంప్లీట్ చేసి ఉండేవారు. కానీ అలా చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.