ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సలార్ మూవీ.. ఎట్టకేలకు 700 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది. దీంతో ప్రభాస్ మరో సరికొత్త రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Salaar: సలార్‌కు వచ్చిన సాలిడ్ హిట్ టాక్‌కు ఖచ్చితంగా వెయ్యి కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశాయి. కానీ ఫైనల్‌గా సలార్ ఫిగర్ 700 నుంచి 800 కోట్ల మధ్యే ఆగిపోయింది. నార్త్‌లో డంకీ వల్ల థియేటర్లు పెద్దగా దొరక్కపోవడంతో సలార్ పై గట్టి ఎఫెక్టే పడింది. అయినా కూడా 2023లో డే వన్ హైయెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఫైనల్‌గా సంక్రాంతికి కొత్త సినిమాలు దూసుకొస్తున్నాయి కాబట్టి.. సలార్ థియేటర్ రన్ క్లోజింగ్ టైం వచ్చేసినట్టే. ఫస్ట్ వీక్‌లో 550 కోట్లు, సెకండ్ వీక్ దాదాపు 660 కోట్లు రాబట్టిన సలార్.. ఫైనల్‌గా ఇప్పుడు 700 కోట్ల మార్క్‌ని క్రాస్ చేసింది.
వరల్డ్ వైడ్‌గా సుమారు 350 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన సలార్.. 700 కోట్లు రాబట్టడంతో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయింది. మిగతా ఏరియాలతో పోల్చుకుంటే.. ఓవర్సీస్, నైజాం లాంటి ప్రాంతాల్లో సలార్‌కు మంచి లాభాలే వచ్చాయి. ఇక ఈ కలెక్షన్స్‌తో ప్రభాస్ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు నుంచే కాదు సౌత్ హీరోల్లో రెండు సార్లు 700 కోట్లు రాబట్టిన ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో బాహుబలి 2, ఇప్పుడు సలార్ 700 కోట్ల క్లబ్లో ఉన్నాయి.
ఇక సౌత్ మొత్తంలో 700 కోట్లు రాబట్టిన ఐదో చిత్రంగా సలార్ నిలిచింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కెజియఫ్ చాప్టర్ 2, రోబో 2.O తర్వాత సలార్ 700 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సలార్ పార్ట్ 1 ఇచ్చిన హైప్‌తో సలార్ 2 ఖచ్చితంగా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని అంటున్నారు. 2025లో శౌర్యాంగ పర్వం రిలీజ్ కానుంది. మరి.. మరోసారి ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.