»Guntur Kaaram All Time Record Mahesh Babu Special Post
Guntur Kaaram: ఆల్ టైం రికార్డ్.. మహేష్ బాబు స్పెషల్ పోస్ట్!
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు-త్రివిక్రమ్ మూడోసారి కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఈసారి మాస్ తప్ప మెసేజులు లేవమ్మా.. అంటూ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. దీంతో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఈవెంట్ విషయంలో మహేష్ స్పెషల్ పోస్ట్ చేశారు.
Guntur Kaaram: ముందు కాస్త ట్రోలింగ్ ఫేజ్ చేసినప్పటికీ.. కుర్చీ మడతపెట్టి ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్‌ను మడతపెట్టడానికి రెడీ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇక ట్రైలర్ చూసిన తర్వాత రమణ గాడి దెబ్బకు రీజనల్ లెవల్లో సరికొత్త రికార్డులు లేవడం గ్యారెంటీ అనేలా ఉంది. వింటేజ్ మహేష్ బాబుని గుర్తు చేస్తూ గుంటూరు కారం సినిమా చేశాడు త్రివిక్రమ్. ఈ మూవీలో మహేష్ బాబు మాస్‌కి కేరాఫ్ అడ్రెస్‌లా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో గుంటూరులో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్‌గా జరగడంతో.. మహేష్ అభిమానుల కోసం ఒక ట్వీట్ చేశాడు. ‘థాంక్స్ గుంటూరు.. నా సొంత ఊరిలో అంతమంది మధ్యలో నా సినిమాని మీ ప్రేమాభిమానాల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం నాకు చిరకాలం ఒక మంచి జ్ఞాపకంలా హృదయానికి దగ్గరగా ఉండిపోతుంది.
మీ అందరినీ మళ్లీ కలవాలి అనుకుంటున్నా.. అతి త్వరలో! సంక్రాంతి మొదలయ్యింది! చాలా థాంక్స్..’ అంటూ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. డే వన్ షోలతో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరు కారం. యూఎస్ఏలో 5408 ప్లస్ షోలతో రిలీజ్ అవుతుండగా.. ఒక్క హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఫస్ట్ డే 41 ప్లస్ షోష్.. AMB సినిమాస్ 42+ షోలు పడుతున్నాయి. దీంతో డే వన్ హైయెస్ట్ షోస్ పడుతున్న సినిమాగా గుంటూరు కారం ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.