»Mahesh Babu This Is The Festival That Suits Me And My Father
Mahesh Babu: నాకయిన.. నాన్నకయినా బాగా కలిసొచ్చే పండగ ఇదే!
సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడారు.
Mahesh Babu: గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులో జరిగింది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ.. నాకయిన.. నాన్నకయినా బాగా కలిసొచ్చిన పండగ సంక్రాంతి. మా సినిమా సంక్రాంతికి విడుదలయితే అది బ్లాక్‌బ్లస్టరే. ఈ సారి కూడా బాగా గట్టిగా కొడతామని మహేశ్‌బాబు అన్నారు. గుంటూరులో ఈ వేడుక జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ ఎక్కడ జరుపుకోవాలని ఆలోచిస్తుంటే మీ ఊళ్లో వేడుక చేద్దామని త్రివిక్రమ్ అన్నారని తెలిపారు.
త్రివిక్రమ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు స్నేహితుడి కంటే ఎక్కువ. నా కుటుంబ సభ్యుడిలా ఉంటారని మహేశ్‌బాబు అన్నారు. గత రెండేళ్ల నుంచి ఆయన ఇచ్చిన సహకారం, అందించిన బలం నేనెప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. త్రివిక్రమ్ సినిమాలో ఎప్పుడు చేసినా నా నటనలో ఓ మ్యాజిక్ కనిపిస్తుంటుంది. గుంటూరు కారంలోనూ అదే జరిగిందని.. కొత్త మహేశ్‌బాబుని చూస్తారని తెలిపారు.