»Charminar Express Train Derailed Many Seriously Injured
Charminar Express: పట్టాలు తప్పిన రైలు.. పలువురికి తీవ్ర గాయాలు
నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం వద్దకు చేరుకోగానే పట్టాలు తప్పింది.
Charminar Express: నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం వద్దకు చేరుకోగానే పట్టాలు తప్పింది. ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో సుమారుగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. రైలు డోర్ల దగ్గర నిలబడిన మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. భయంతో కొంతమందికి గుండెపోటు రావడంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. డెడ్ ఎండ్ లైన్ ప్రహరీకి తాకడం వల్ల బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. కొంతమందికి మాత్రమే గాయాలయ్యాయి.