హీరో నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సరిపోదా శనివారం’. ఇటీవల విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ OTT ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈనెల 26 నుంచి ప్రసారం కానుంది. SJ సూర్య విలన్గా ఆకట్టుకున్న ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించారు. సాయికుమార్ అభిరామి, అదితి బాలన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.