»Ogteaser Good News For Pawan Kalyan Fans Big Update From Og
OGTeaser: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..రెడీ ఫర్ ఓజీ
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్, డీవీవీ దానయ్య కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). త కొంతకాలంగా పవర్ స్మార్ట్ అనే పొస్టర్లతో సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేయిన ఈ చిత్రం నుంచి ఈ రోజు ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ రాబోతుందని తెలుస్తోంది.
OGTeaser, Good news for Pawan Kalyan fans. Big update from OG
OGTeaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాల కోసం అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో సుజిత్(Sujith) దర్శకత్వం వహిస్తున్న ఓజీ(OG) చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముంబయ్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఓ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. కచ్చితంగా ఓజీ నుంచి సాలిడ్ అప్డేట్ వస్తుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ మనోబాల విజయబాలన్ ఒక అప్డేట్ ఇచ్చారు. HUNGRYCHEETAH హ్యాష్ ట్యాగ్‌తో ఈ రోజు ఓజీ టీజర్‌కు సంబంధించిన డేట్ అండ్ టైమ్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో అభిమానులో ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది. వన్ కల్యాణ్ పుట్టిన రోజున మరింత ఆనందంతో జరుపుకోవడానికి ఓజీ టీజర్ సిద్ధం అవుతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి తమన్(ss thaman) సంగీత దర్శకుడుగా పనిచేస్తుండగా, ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్గా నటిస్తోంది.