పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా ‘OG’. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ప్రకాష్ రాజ్‌పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. వచ్చే నెల నుంచి పవన్ కళ్యాణ్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.