నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన 'హాయ్ నాన్న' ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే నాని వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేస్తున్నాడు. తాజాగా పార్టీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
దసరా తర్వాత నాని చేస్తున్న క్లాస్ సినిమా ‘హాయ్ నాన్న(HI NANNA)’. సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ నటిస్తున్న రెండు తెలుగు సినిమా ఇది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో హాయ్ నాన్న తెరకెక్కింది. ఈ సినిమాతో యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నాడు. ఇటీవల టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేయగా.. సినిమా పై మంచి బజ్ జనరేట్ అయింది. తాజాగా ఓడియమ్మ అంటు సాగే సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ సాంగ్‌లో శృతి హాసన్‌తో కలిసి స్టెప్పులేశాడు నాని. ఈ సినిమాలో శృతిహాసన్ కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. అందుకే.. ఈ సాంగ్‌ను నాని, శృతి హాసన్ పై స్పెషల్‌గా డిజైన్ చేశారు. బీచ్ ఒడ్డున పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ సెట్లో షూట్ చేశారు.
అయితే హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ సాంగ్‌ను.. చియాన్ విక్రమ్ కొడుకు(Vikram son) ధృవ్ విక్రమ్‌తో కలిసి శృతి హాసన్(shruti haasan) పాడడం విశేషం. దీంతో ఈ సాంగ్ సినిమాలో స్పెషల్‌గా నిలవనుందని అంటున్నారు. ఇది పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ అని, అందరికి నచ్చుతుందని నాని చెప్పుకొచ్చాడు. ఈ పాటను నవంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతానికి నాని ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 7న రిలీజ్ కానుంది హాయ్ నాన్న. దీంతో రిలీజ్ టైం దగ్గర పడడంతో హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నవంబర్ 29న విశాఖపట్నంలోని ఆర్కె బీచ్ వద్ద గోకుల్ పార్క్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.