NTR 30 : ప్రభాస్ విలన్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తలపడేందుకు రెడీ అవుతున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ అనుకొని కారణాల వల్ల డిలే అవుతు వస్తోంది.
ప్రభాస్ విలన్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తలపడేందుకు రెడీ అవుతున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ అనుకొని కారణాల వల్ల డిలే అవుతు వస్తోంది. అయితే ఇప్పుడు ఆస్కార్ వేడుక కూడా అయిపోయింది కాబట్టి.. ఎన్టీఆర్‌కు 30కి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. మార్చి 23న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాయి. హీరోయిన్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. అయితే విలన్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ దాదాపుగా ఫిక్స్ అయ్యాడని అంటున్నాయి. ఎన్టీఆర్ 30లో విలన్ రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందట. అందుకే సైఫ్ అలీఖాన్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న’ఆదిపురుష్’ సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు సైఫ్. జూన్ 16న ఆదిపురుష్ రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత సైఫ్ చేస్తున్న తెలుగు సినిమా ఎన్టీఆర్ 30నే అని చెప్పాలి. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఆచార్యతో కొరటాల భారీ ఫ్లాప్ ఫేజ్ చేశాడు. దాంతో ఎన్టీఆర్ 30తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మరి ఎన్టీఆర్ 30 ఎలా ఉంటుందో చూడాలి.