ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా… అంటూ బాహుబలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నోరా ఫతేహీ గుర్తుందా? అదొక్కటే కాదు.. చాలా సినిమాల్లో నోరా ఐటెమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ వేసి రచ్చ చేసింది. నిజానికి బాలీవుడ్లో తను స్టార్ హీరోయిన్. కానీ.. తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ అభిమానుల మనసు దోచుకుంది. తన అందానికి పడిపోయారు. బాలీవుడ్లో బిజీ బిజీగా ఉండే నోరా ఫతేహీ సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ హడావుడి చేస్తుంటుంది.
తన పుట్టిన రోజు కూడా ఇటీవలే ఫిబ్రవరి 6న జరిగింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసింది. దుబాయ్‌కి వెళ్లి అక్కడ సముద్రం మధ్యలో షిప్లో తన బర్త్ డే వేడుకలు జరుపుకుంది. ఈసందర్భంగా బెల్లీ డ్యాన్స్ వేసింది ఈ ముద్దుగుమ్మ. దాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగలేకపోతున్నారు. చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఆవీడియోను తెగ వైరల్ చేస్తూ.. చాలా డిస్టర్బ్ చేస్తున్నావు నోరా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.