Nitin: ‘నితిన్-వక్కంతం వంశీ’ ఫస్ట్ లుక్ టైం ఫిక్స్!
గత కొన్నాళ్లుగా బ్యాడ్ టైం ఫేజ్ చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. ఒక్క సాలిడ్ హిట్ కూడా అందుకోలేకపోయాడు. ప్రస్తుతం యంగ్ హీరో నితిన్.. వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు టైం ఫిక్స్ చేశారు.
2020లో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు నితిన్. చెక్, రంగ్‌దే, మాస్ట్రో, మాచర్ల నియోజక వర్గం సినిమాలు సరైన విజయాలు అందుకోలేకపోయాయి. రంగ్‌దే సినిమా పర్వాలేదనిపించినా మిగతా సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నితిన్. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. బన్నీతో ‘నా పేరు సూర్య’ సినిమాతో మెగా ఫోన్ పట్టిన రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు ప్రజెంట్ సెట్స్ పై ఉన్నాయి. అయితే ముందుగా వక్కంతం వంశీ సినిమా ఆడియెన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా పై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండడంతో.. సినిమా పై మంచి బజ్ ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 23న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు. సినిమా స్టార్టింగ్‌లో జూనియర్ అనే టైటిల్ వినిపించినా.. తాజాగా ‘ఎగస్ట్రా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆర్టీనరీ మ్యాన్ అనేది ఉపశీర్షికట. మొత్తంగా చూసుకుంటే ఎక్స్ట్రార్డినరీగా వచ్చేలా టైటిల్‌ను ప్లాన్ చేశారట. రేపే టైటిల్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఫ్లాపుల్లో ఉన్న నితిన్, వక్కంతం వంశీ కలిసి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.