బాలీవుడ్ నటి హీనా ఖాన్ (Actress Hina Khan) ఎయిర్‌పోర్ట్‌లో హల్చల్ చేసింది. శ్రీనగర్(Srinagar)లో జరిగిన జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న ముద్దుగుమ్మ సమావేశాల అనంతరం ముంబయి చేరుకున్న భామకు బాయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ (Rocky Jaiswal)విమానాశ్రయంలో స్వాగతం పలికాడు. అదే సమయంలో ఈ జంట లిప్లాకక్తో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అయితే ఇలా బహిరంగంగా కిసులు పెట్టుకోవడం ఏంటని నెటిజన్స్ (Netizens) తీవ్రంగా మండిపడుతున్నారు. అంత త్వరగా ముద్దుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు రాస్తూ పబ్లిక్ ముందు ఇలా చేసినందుకు సిగ్గుపడండి అంటూ రాసుకొచ్చారు. వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారా అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. పబ్లిక్ ఇలాంటి పనులు చేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు.కాగా.. హీనా ఖాన్, రాకీ జైస్వాల్ చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. వీరిద్దరి రిలేషన్‌పై బిగ్ బాస్ (Big Boss) హౌస్‌లో కూడా ఆమె మాట్లాడింది. గతంలో ఈ జంట బ్రేకప్ చేసుకుందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను హీనా ఖాన్ ఖండించిన సంగతి తెలిసిందే.