ఇటు అఖండ, అటు క్రాక్ తర్వాత.. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో.. ఎన్బీకే 107 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ మాత్రం అనౌన్స్ చేయలేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. దసరా కానుకగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్‌ను అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికైతే ముందుగా ఈ సినిమాను దసరా రేసులోనే దింపాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. దాంతో డిసెంబర్లో లేదా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అందుకే దసరాకు టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఎన్బీకె107 షూటింగ్ సందర్భంగా, గోపీచంద్ మలినేని ఫ్యామిలీ మరియు బాలయ్య ఫ్యామిలీ కలిసి.. విదేశాల్లో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మోక్షజ్ఞ కూడా ఉండడంతో హ్యాపీ ఫీల్ అవుతున్నారు అభిమానులు. అది కూడా స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటో ఏది వచ్చినా.. క్షణాల్లో వైరల్ అవుతోంది. మామూలుగా అయితే మోక్షజ్ఞ ఫోటోలు రేర్‌గా బయటికొస్తుంటాయి. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో దర్శనమిస్తునే ఉన్నాడు మోక్షజ్ఞ. దాంతో తమ అభిమాన హీరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమవుతోందని అంటున్నారు ఫ్యాన్స్. మరి మోక్షజ్ఙ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.