అక్కినేని మూడో తరం హీరో నాగచైతన్య సినిమాలతోపాటు.. బిజినెస్ కూడా చేస్తున్నాడు. త్వరలో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇప్పుడు సొంతంగా ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. అందులో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
Naga Chaitanya: చివరగా కస్టడీ మూవీతో మెప్పించలేకపోయిన నాగ చైతన్య (Naga Chaitanya).. డిసెంబర్ 1న ధూత అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం తన 23వ సినిమాను యంగ్ డైరెక్టర్ చందూ మొండేటితో చేస్తున్నాడు చైతూ. ఈ సినిమాలో రఫ్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే గడ్డం కూడా పెంచి.. రగ్గ్డ్ లుక్‌లోకి వచ్చేశాడు. తాజాగా చైతన్య (Naga Chaitanya) షేర్ చేసిన వీడియోలోనూ అలాగే కనిపించాడు. ఈ లుక్ చందు మొండేటి సినిమా కోసమేనని చెప్పాడు. చైతన్య షేర్ చేసిన వీడియో యూట్యూబ్ కోసం. అది కూడా తన సొంత ఛానల్లో షేర్ చేశాడు. ఎందుకంటే.. తన పేరు మీద సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు చైతూ (Naga Chaitanya).
‘అక్కినేని నాగచైతన్య’ పేరుతో ఛానల్ క్రియేట్ చేసి.. అందులో అదిరిపోయే లుక్‌లో ఉన్న వీడియో పోస్ట్ చేశాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ చేశాడు. ‘జుట్టు, గడ్డం పెంచడానికి కారణం ఏంటి? అని అడగ్గా.. ఆరు నెలలుగా జాబ్ లేదని, ఇంట్లో ఖాళీగా ఉంటున్నట్లు చెప్పాడు. పనేం లేక జుట్టు, గడ్డం పెంచినట్లు సరదాగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత తాను హీరోగా నటిస్తోన్న చందూ మొండేటి సినిమా కోసం పెంచినట్టు క్లారిటీ ఇచ్చాడు.
ధూత వెబ్ సిరీస్ గురించి అడగ్గా.. ప్రతిరోజు ధూతను కలవకుండా మీ డే స్టార్ట్ అవదు.. ధూత గురించి మరిన్ని విషయాలను డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌ను అడగాలని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా.. సొంత యూట్యూబ్ ఛానల్ సెలబ్రిటీస్ అదనపు ఇన్కమ్ అనే చెప్పాలి.