»Mythri Movie Makers Who Are Rushing With Blockbuster Movies
Mythri Movie Makers: బ్లాక్ బస్టర్ మూవీస్‌తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్
టాలీవుడ్లో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) వరుస సినిమాలతో దూసుకుపోతోంది. బడా సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాదిలో వరుసగా రెండు భారీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.
టాలీవుడ్లో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) వరుస సినిమాలతో దూసుకుపోతోంది. బడా సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాదిలో వరుసగా రెండు భారీ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ రెండు సినిమాలు కూడా రూ.100 కోట్లకు పైనే కలెక్షన్స్ వసూలు చేశాయి. రెండు సినిమాల్నీ ఒక్క రోజు తేడాతో విడుదల చేసి మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సంస్థ నుంచి తాజా అమిగోస్ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ పేరు మారుమోగిపోతోంది.
గతంలో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నుంచి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ హిట్లు పడ్డాయి. ఆ దెబ్బతో మైత్రీ మూవీ మేకర్స్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. స్ట్రాంగ్ బేస్ వేసుకుని ఈ నిర్మాణ సంస్థ సరికొత్త ప్రయోగాలను చేస్తోంది. రవి శంకర్, నవీన్ ఎర్నేని ఎంతో ఫ్యాషన్‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. వీరి బ్యానర్లో ఏ స్టార్ సినిమా చేసినా కూడా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకుంటూ వస్తోంది. రెండు, మూడు సినిమాల్ని ఏకకాలంలో షూట్ జరపడం వల్ల మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) పేరు మారుమోగుతోంది. ప్రతి ఏడాదీ కోట్ల టర్నోవర్‌తో భారీ సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తూ వస్తోంది. 2023లో ఇప్పటి వరకూ రెండు సినిమాలను రిలీజ్ చేసి రూ.350 కోట్లకు పైగానే వసూళ్లను సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ రెండు సినిమాలు విడుదలై నెల రోజులు కూడా పూర్తవ్వకుండానే అమిగోస్ సినిమాను విడుదల చేసి మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సక్సెస్‌ను అందుకోవడం విశేషం. ఫిబ్రవరి 10వ తేదిన కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించాడు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్‌తో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
తాజాగా మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఒక్క తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా సినిమాలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మలయాళం, హిందీలో అడుగుపెట్టిన మైత్రి మేకర్స్ త్వరలో అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మైత్రీ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఖుషి, పుష్ఫ2, ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్ 31, ఆర్సీ 16, నడిగర్ తిలకం వంటి సినిమాలు రూపొందుతున్నాయి. త్వరలో సల్మాన్ ఖాన్‌తో కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా ఆహా ఓటీటీ కోసం కొన్ని వెబ్ సిరీస్‌లను కూడా మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలో పాటు వరుస సక్సెస్‌లతో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) దూసుకుపోతోంది. వరుస సినిమాలతో టాలీవుడ్లోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది.