వైద్య రంగంలో అరుదైన సేవలను అందిస్తూ దేశం యావత్తు తనదైన గుర్తింపు సంపాదించుకున్న అపోలో హాస్పిటల్స్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తాజాగా అపోలో హాస్పిటల్స్ చిన్న పిల్లల కోసం అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని ప్రారంభించింది. ఈ అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లోగోను అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని (Upasana Kamineni) కొణిదెల ఆవిష్కరించారు. కార్యక్రమంలో అపోలో డాక్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఉపాసన కామినేని కొణిదెల మాట్లాడుతూ ‘‘నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో అందరూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించటంతో పాటు ఆశీర్వాదాలను అందించారు. నా ప్రెగ్నెన్సీ జర్నీని అద్భుతమైన జ్ఞాపకంగా చేసిన అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. అపోలో (Apollo) పీడియాట్రిక్, అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ తల్లికి ప్రెగ్నెన్సీ (Pregnancy) అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటే వారి ఆనందానికి అంతే ఉండదు. అలాంటి మధుర క్షణాలను తల్లిదండ్రులకు అందిస్తోన్న డాక్టర్స్‌కు ధన్యవాదాలు.
నా ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మంది నన్ను కలిసి వారి సలహాలను ఇచ్చేవారు. అయితే కొందరి మహిళలకు ఇలాంటి సపోర్ట్ దొరకదు. ఆ విషయం నాకు తెలిసి బాధవేసింది. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్‌కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ పెద్దగా ఉండదు. కాబట్టి అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా నేను ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నాను. వీకెండ్స్‌లో సింగిల్ మదర్ పిల్లలకు ఉచితంగా ఓపీడీ చికిత్సను అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీ( emotional journey) లో నేను వారికి నా వంతు సపోర్ట్ అందిచటానికి సిద్ధం. ఈ ప్రకటన చేయటానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
చదవండి :ఆయన భార్యకు 25 మంది పిల్లలు..డీఎన్ఏ టెస్ట్ చేస్తే 15 మందే షాకింగ్ రిపోర్టు