Chiranjeevi: బబుల్గమ్ నుంచి ఇజ్జత్ సాంగ్ లాంచ్ చేసిన మెగాస్టార్
టాలీవుడ్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల నటించిన బబుల్గమ్ చిత్రం నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు.
Chiranjeevi: యాంకర్ సుమ, యాక్టర్ రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బబుల్గమ్. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకన్నాయి. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా సెకండ్ సాంగ్ కూడా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేతుల మీదుగా ఇజ్జత్ అనే సాంగ్ రెండో పాటను రిలీజ్ చేయించారు. ఫాస్ట్ బీట్తో ఉన్న ఈ పాటలో లిరిక్స్ చాలా క్రిస్పీగా ఉన్నాయి. రోషన్‌తో మానస చౌదరి(Maanasa Choudhary) హీరోయిన్గా నటిస్తుంది. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. లేటెస్ట్గా విడుదలైన ఇజ్జత్ సాంగ్‌కు రచయితగా ఎమ్సీ హరి పనిచేశారు.