»Bubblegum Movie Review Roshan Hit With His First Film
Bubblegum Movie Review: తొలి చిత్రంతో రోషన్ హిట్ కొట్టాడా!
సుమ కనకాల వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్గా మెప్పించింది. వీరిద్దరికి ఇది మొదటి సినిమా. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది హీరోల సినిమాల ఇంటర్వూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి హోస్టింగ్ చేసింది. గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న సుమ తన కొడుకును హీరోగా పరిచయం చేసింది. రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన బబుల్ గమ్‌తో చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? సుమ వారసత్వంగా వచ్చిన రోషన్ కనకాల హీరోగా ఎలా చేశాడు? హిట్టు కొట్టాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం: బబుల్ గమ్ నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు కథ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని సంగీతం:శ్రీచరణ్ పాకాల దర్శకత్వం: రవికాంత్ పేరేపు ఛాయాగ్రహణం: సురేష్ రగుతు నిర్మాణ సంస్థ:మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల తేదీ: 21-12-2023
కథ
ఆది ఆలియాస్ ఆదిత్య (రోషన్ కనకాల) మధ్యతరగతికి చెందిన పక్కా హైదరాబాద్ కుర్రాడు. ఆది డీజే కావాలన్న లక్ష్యంతో జీవిస్తుంటాడు. ఈక్రమంలో ఓ పార్టీలో జాను అలియాస్ జాన్వీ (మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె ధనవంతురాలు. ఆధునిక జీవన శైలికి అలవాటు పడిన ఆమెకు ప్రేమ, పెళ్లి వంటి ఎమోషన్స్‌పై నమ్మకం కూడా లేదు. అబ్బాయిలను ఆటబొమ్మల్లా చూస్తుంది. ఆది డీజే, వ్యక్తిత్వం నచ్చి సన్నిహితంగా ఉంటుంది. అలా తనతో ప్రేమలో పడిపోతుంది. ఈక్రమంలో జాను ఓ రోజు ఆదిని దారుణంగా అవమానిస్తుంది. దీంతో ఎన్నో సమస్యలు వస్తాయి. వీరిద్దరూ ఈ సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు? వేర్వురు మనస్తత్వాలు కలిగిన వీళ్లు చివరికి కలుస్తారా? లేదా? అనేది సినిమా స్టోరీ.
ఎలా ఉందంటే?
అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ, ముద్దులు, హగ్గులు, తర్వాత గొడవలు తరహాలోనే చాలా లవ్ స్టోరీలన్ని ఉంటాయి. ఈ చిత్రం కూడా ఇలాంటి నేపథ్యం గల స్టోరీనే. సినిమా క్లైమాక్స్ తప్ప మిగతా కథనమంతా చాలా రొటీన్‌గా ఉంటుంది. హీరో కుటుంబ వాతావరణం, డీజే నేపథ్యం వంటివి చూస్తే.. మొదట్లో డీజే టిల్లు సీన్లు కనిపిస్తాయి. ఓ ఫైట్‌తో హీరో రోషన్ పరిచయం అవుతాడు. ఇక్కడి నుంచి కథ ఆరు నెలలు వెనక్కి వెళ్తుంది. పక్కా హైదరాబాదీ కుర్రాడిగా కనిపించే రోషణ్ ఓ డీజే దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద డీజే కావాలని కలలు కంటాడు. ఎప్పుడూ తిట్టే తండ్రి, ఏం చేసిన సపోర్ట్ చేసే తల్లి. అనుకోకుండా జాన్వీని చూసిన హీరో తనతో ప్రేమలో పడతాడు. అలా సాగిన వాళ్ల ప్రేమ కధ సెకాండాఫ్‌లో రివేంజ్ డ్రామాగా మారుతుంది. ఫస్టాప్‌లో సరదాగా ఉన్న హీరోహీరోయిన్.. సెకాండాఫ్‌లో మాత్రం సీరియస్ డ్రామాలో కనిపిస్తారు. బబుల్గమ్ టైటిల్‌కి తగ్గట్టే ఫస్టాప్ అంతా సాగదీసి వదిలిన డైరక్టర్ సెకండాఫ్ మాత్రం బాగుంటుంది. కాకపోతే హీరోహీరోయిన్ల పరిచయం, వాళ్లిద్దరూ దగ్గరకావడం, ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకోవడంలో పెద్దగా ఎమోషన్స్ కనిపించవు. లవ్ ట్రాక్‌తో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేరు. రొమాంటిక్ సీన్లలో ప్రేమ కంటే మోహం ఎక్కువగా కనిపిస్తుంది. ద్వితీయార్థంలో తండ్రికొడుకుల అనుబంధాల నేపథ్యంలో వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మానస గ్లామర్‌గా కనిపించడంతో పాటు నటన కనబరిచింది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ద్వితీయార్థంపై ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్థంలో సినిమా మొత్తం జానునే నడిపిస్తుంది. యువతకు సందేశం ఇచ్చేలా ముగింపు ఉంటుంది.
ఎవరెలా చేశారంటే?
హైదరాబాద్ కుర్రాడిగా ఆది పాత్రలో రోషన్ చక్కగా ఒదిగిపోయాడు. అతని లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్ని బాగున్నాయి. అన్ని సన్నివేశాల్లోనూ చక్కటి నటన కనబరిచాడు. అందం, అభినయం, నటనతో మానస చౌదరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో తండ్రిగా చైతూ జొన్నలగడ్డ పాత్ర అందర్ని ఆకట్టుకుంటుంది. ద్వితీయార్థానికి ఈ పాత్ర ప్రధాన ఆకర్షణ.
సాంకేతిక అంశాలు
దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారనిపిస్తుంది. శ్రీచరణ్ పాటలు పెద్దగా ఆకట్టుకోలదు. నేపథ్య సంగీతం బాగుంది. సురేష్ ఛాయాగ్రహణం ఒకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగానే ఉన్నాయి.