పరభాష సినిమాను తెలుగు ఆడియెన్స్ చూసిన సరే.. దాన్ని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టడం మెగాస్టార్ స్టైల్. ఈ క్రమంలోనే దసరాకు ‘గాడ్ ఫాదర్’గా రాబోతున్నారు చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కి రీమేక్‌గా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ ట్రైలర్, సాంగ్స్.. ఒరిజినల్ వెర్షన్ కంటే కొత్తగా ఉండబోతోందని చెప్పకనే చెబుతోంది. డైరెక్టర్ కూడా ఫ్రెష్ స్క్రీన్ ప్లే రాసుకున్నామని చెబుతున్నాడు. ఒరిజినల్ సోల్ మిస్ అవకుండా.. ఒక కొత్త ఐడియాతో.. మెగాస్టార్‌కు ఎక్కువ స్క్రీన్ స్పేస్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు.. గాడ్ ఫాదర్ గూస్బంప్స్ ఇచ్చేలా ఉంటుందని హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అలాగే ఇందులో హీరోతో పాటు మరో పది, పన్నెండు పాత్రలు చాలా సర్ప్రైజింగా వుంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు చూసిన సినిమా అయిన సరే.. గాడ్ ఫాదర్ సరికొత్తగా ఉంటుందని అంటున్నాడు. ఈ నేపథ్యంలో.. గాడ్ ఫాదర్లో బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వీళ్లతో పాటు రామ్ చరణ్ కూడా ఇందులో గెస్ట్ రోల్ చేశాడని సమచారం. మరో వెర్షన్ ప్రకారం.. ఎక్కడా రివీల్ చేయపోయినా.. మలయాళంలో టోవినో థామస్ పోషించిన పాత్ర పవర్ ఫుల్‌గా ఉండడంతో.. పవన్ కళ్యాణ్ ఆ రోల్ చేశాడని టాక్. మొత్తంగా గాడ్ ఫాదర్లో చరణ్ లేదా పవన్ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడం పక్కా అంటున్నారు. మరి ఇది తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.