కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్.. ఈసారి మరో విభిన్నమైన సినిమాతో వస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ అనే టైటిల్‌తో రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పుల్వామా వెళ్లాడు వరుణ్.
Mega hero Varun Tej who went to Pulwama. Tribute to the martyrs
Operation Valentine: గతేడాది లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. పెళ్లి తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. వాస్తవానికైతే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల చేత వాయిదా పడుతూ.. ఫైనల్‌గా మార్చ్ 1న థియేటర్లోకి రాబోతోంది ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కింది. మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటించగా.. రుహని శర్మ కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది చిత్ర యూనిట్. బాలీవుడ్లో వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కేవలం మూడు రోజుల్లోనే పాతిక ఇంటర్వ్యూ లు ఇచ్చాడని సమాచారం.
ఇక ఇప్పుడు ప్రమోషన్స్‌లో భాగంగా.. ఆపరేషన్ వాలెంటైన్ టీం కాశ్మీర్‌లోని శ్రీనగర్ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో.. ఫిబ్రవరి 14న అక్కడి వెళ్లారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు 2019లో శ్రీనగర్ దగ్గర పూల్వమా ప్రాంతంలో జరిగిన టెర్రరిస్టుల బాంబు దాడిలో.. 40 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. చాలామంది గాయపడ్డారు. దీంతో.. ఫిబ్రవరి 14న ఆపరేషన్ వాలెంటైన్ టీం.. పుల్వామా మెమోరియల్ సైట్‌కి వెళ్లి.. అమరవీరుల స్థూపం దగ్గరకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.