»Mega Brothers In One Frame Nagababu Emotional Post
Mega brothers : ఒకే ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్..నాగబాబు ఎమోషనల్ పోస్ట్
మెగా బ్రదర్ నాగబాబు తమ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఉన్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేశారు.వరుణ్ పెళ్ళిలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. మా మధ్య ఎన్ని విభేదాలు, వాదనలు ఉన్నమా బంధం మాత్రం ఎప్పటికి ప్రత్యేకంగా ఉంటుందని పోస్ట్ చేశారు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యత్రిపాఠీల పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.మెగా బ్రదర్స్ చిరంజీవి (Chiranjeevi), నాగబాబు(Nagababu), పవన్ కల్యాణ్(Pawan kalyan)ల ఫొటో ఒకటి నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నాగబాబు ఈ ఫొటోను షేర్ చేస్తూ అన్నదమ్ముల బంధం గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.తమ మధ్య బేదాభిప్రాయాలు, వాదనలు ఉన్నప్పటికీ.. తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఆ అనుబంధం తాము చేసిన పనులకు, వాటి జ్ఞాపకాలకు చెందినది మాత్రమే కాదని.. అది ఎంతో లోతైన బంధమని అన్నారు.
తమది విడదీయలేని అనుబంధమని తెలిపారు.మా అన్నదమ్ముల బంధం ఎప్పటికీ ప్రత్యేకమైనదే. ఈ ఫొటో ఓ జ్ఞాపకం (Memory) మాత్రమే కాదు అంతకు మించింది. మా మధ్య ఉన్న అభిప్రాయాలు, విభేదాల కంటే లోతైన అనుబంధం చాలా ముఖ్యమైనది, బలమైనది. ప్రేమతో కూడిన ఎన్నో మధుర క్షణాలతో ఈ రిలేషన్ (Relation) ముడిపడి ఉంది. ఇది ఎప్పటికీ విడదీయరానిది. దీనికి నేనెంతో విలువిస్తాను’’ అంటూ నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ఫొటో చూసి మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ‘పిక్చర్ పర్ఫెక్ట్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠీల పెళ్లి సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట చేరి సంతోషకర సమయాన్ని గడిపింది.