»Mansoor Ali Khan File A Defamation Suit Against Chiranjeevi Trisha And Khushboo
Mansoor Ali Khan: చిరంజీవి, త్రిషపై పరువునష్టం దావా వేస్తా!
నటుడు మన్సూర్ అలీఖాన్ హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత వారం రోజులుగా సోషల్‌మీడియాలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. దీంతో త్రిషకు సారీ కూడా చెప్పాడు. ఇక అంతా అయిపోయింది అనుకుంటే ఈ కేసు మరో మలుపు తిరిగింది. తన మాటలను వక్రీకరించారని, చిరంజీవి, కుష్బూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వారిపై పరువనష్టం దావా వేస్తా అంటున్నారు.
Mansoor Ali Khan File a defamation suit against Chiranjeevi, Trisha and Khushboo
Mansoor Ali Khan: తాజాగా హీరోయిన్ త్రిష(Trisha), నటుడు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) నడుమ వివాదం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో త్రిష అభిమానులు మన్సూర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. త్రిష సైతం ఆయన మాటలు వింటుంటే భయం వేసింది అని వ్యాఖ్యనించారు. దాంతో త్రిషకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు మద్ధతుగా నిలిచారు. లోకేష్ కనుగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమాలో త్రిష హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అందులో మన్సూర్ అలీఖాన్ హీరో గ్యాంగ్‌లో ఒకడిగా నటించాడు. అయితే లియోలో త్రిషను రేప్ చేసే సీన్ లేకపోవడం తనను నిరాశకు గురిచేసిందని మన్సూర్ అలీఖాన్ అన్నట్లు పలు కథనాలు వచ్చాయి.
ఆ వార్తలతో సోషల్ మీడియాలో, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో తీవ్ర రచ్చ జరిగింది. ఈ సందర్భంగా త్రిషకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), కుష్బూ(Khushboo) వంటి తారలు మద్దతు పలికారు. మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు త్రిషకు క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ఆగిపోయిందని భావించారు. అయితే, ఈ వివాదం కాస్తా ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని మన్సూర్ అలీఖాన్ ధ్వజమెత్తారు. తాను మాట్లాడిని మాటలను ఎడిట్ చేసి, త్రిషపై అసభ్యంగా వ్యాఖ్యనించినట్లు చూపించారని ఆరోపించారు. తనపై త్రిష, చిరంజీవి, కుష్బూ తదితరులు అవనసరంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, తనను మానసికంగా బాధించారని, వారిపై పరువునష్టం దావా వేస్తున్నానని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.