హీరో మంచు మనోజ్ బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశాడు. తన హృదయానికి దగ్గరైన ప్రత్యేక విషయాన్ని కొంతకాలంగా తనలోనే దాచుకుంటున్నానని, జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, జనవరి 20వ తేది ఆ విషయాన్ని ప్రకటిస్తానని మంచ్ మనోజ్ ట్వీట్ చేశారు. అందరి ఆశీస్సులు తనకు కావాలని కోరారు. తన మొదటి సినిమా అయిన ‘దొంగదొంగది’ నుంచి ఒక జిఫ్ ఫైల్ ను కూడా మంచు మనోజ్ యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు మంచు మనోజ్ కొత్త సినిమా గురించి అయ్యుంటుందేమోనని, మరికొందరు తన పెళ్లి విషయం చెబుతాడేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.