SSMB 28 వర్కింగ్ టైటిల్‌తోనే సినిమా మొదలు పెట్టారు మహేష్ బాబు-త్రివిక్రమ్. ఇటీవలె రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఫస్ట్ షెడ్యూల్లో మహేష్ పై హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ తెరకెక్కించినట్టు సమాచారం. దసరా తర్వాత మొదలుకానున్న కొత్త షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అవనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది. అసలే అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 ఏళ్లకు మహేష్-త్రివిక్రమ్ కలిసి హ్యాట్రీక్ మూవీ చేస్తున్నారు. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో మహేష్ కోసం ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే ఆసక్తి అందరిలోను ఉంది.
టైటిల్స్ విషయంలో త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. దాంతో మహేష్ కోసం ‘అ’ తో మొదలయ్యేలా టైటిల్ ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ముందు నుంచి ఈ సినిమాకు ‘అర్జునుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు అర్జునుడుకి ముందు.. ఓ పవర్ ఫుల్ క్లాస్, మాస్ టచ్ ఇచ్చేలా టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్ దాదాపుగా ఖరారైందని టాక్. ఈ టైటిల్ అన్ని విధాలుగా మహేష్‌కు పర్ఫెక్ట్గా ఉంటుందని భావిస్తున్నాడట త్రివిక్రమ్. అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఈ టైటిల్ పై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. మరి 2023 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ‘అయోధ్యలో అర్జునుడు’ టైటిల్‌నే పెడతారేమో చూడాలి.