మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా ఉంటాడు.. మిల్క్ బాయ్‌లా ఉంటాడు. ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిగానే కనిపిస్తాడు. అలాంటి మహేష్ బాబు బిచ్చగాడుగా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది మహేష్ ఫ్యాన్స్‌కు కాస్త ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ.. బిచ్చగాడుగా మహేష్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని చెబుతున్నాడు విజయ్ ఆంటోని.
Mahesh Babu:మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన బిచ్చగాడు సినిమా.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. 2016లో తమిళ్ డబ్బింగ్ సినిమాగా వచ్చిన బిచ్చగాడు.. తెలుగులో భారీ విజయం సాధించింది. మేకర్స్‌కు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో హీరో విజయ్ ఆంటోనీకి మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో బిచ్చగాడుకి ప్రీక్వెల్‌గా వస్తున్న బిచ్చగాడు 2 పై భారీ అంచనాలున్నాయి. మే 19న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి రానుంది. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాకుండా.. దర్శకత్వం కూడా వహించారు. విజయ్ ఆంటోనీ భార్య నిర్మాతగా వ్యవహరించింది. కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.
రీసెంట్గా బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ హీరో అడివి శేష్ గెస్ట్ వచ్చాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. విజయ్ ఆంటోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ బిచ్చగాడుగా మీరు కాకుండా మరో హీరో ఎవరు చేస్తే బావుంటుందని అనే క్వశ్చన్ ఎదురైంది. దీనికి ఆసక్తికరంగా ఆన్సర్ చేశాడు విజయ్ ఆంటోని. తెలుగులో అయితే బిచ్చగాడు సినిమా.. మహేష్ బాబుకి కరెక్ట్‌గా సరిపోతుందని.. ఎమోషన్స్ పండించాలంటే మహేష్ బాబు బాగా సెట్ అవుతారని అన్నారు. ఇక తమిళంలో విజయ్, అజిత్ బెటర్ ఆప్షన్స్ అని అన్నారు. దీంతో విజయ్ ఆంటోని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రం.. బిచ్చగాడు పాత్రలో మహేష్‌ను ఊహించుకోలేం అంటున్నారు. మరి నిజంగానే మహేష్ బిచ్చగాడుగా చేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి.