Niharka: వరుణ్ తేజ్ వివాహం మరోసారి వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ వివాహం చేసుకోనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అది నిజమేనని తెలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపినట్టు సమాచారం. నిశ్చితార్థం కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
లావణ్య పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరులో వరుణ్ ఆమెకు డైమండ్ రింగ్ ఇచ్చి మరీ మ్యారేజ్ ప్రపోజల్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రపోజల్ ని ఆమె వెంటనే యాక్సెప్ట్ చేశారట. తర్వాత ఇరువైపులా పెద్దలు కూడా వీరి ప్రేమను అర్థం చేసుకోవడంతో పెళ్లికి దారితీసినట్లు తెలుస్తోంది.
వీరి పెళ్లి వార్తలకు సంబంధించిన ప్రశ్నలు మెగా డాటర్ నిహారికకు (Niharka) ఎదురయ్యాయి. తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆమెకు తన వెబ్ సిరీస్ కంటే, వరుణ్ పెళ్లి పైనే ఎక్కువ ప్రశ్నలు రావడం గమనార్హం. ఆ విషయంపై మాట్లాడేందుకు నిహారిక (Niharka) అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఆ విషయం గురించి మాట్లాడానికి కూడా ఆమె ఇష్టపడలేదు.
తన వెబ్ సిరీస్ గురించి మాత్రమే మాట్లాడటానికి వచ్చాని చెప్పింది. ఈ పెళ్లి వార్తలు నిజమా కాదా అనే సందేహాలు మొదలయ్యాయి. లావణ్య, నిహారికలు (Niharka) మంచి స్నేహితులు. మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో లావణ్య చాలా సార్లు పాల్గొన్నారు. నిహారిక (Niharka) పెళ్లిలో సమయంలో సందడి చేశారు.