»Madhavan Who Is Making Another Scientist Biopic First Look Release
Madhavan : మరో సైంటిస్ట్ బయోపిక్‌ను తెరకెక్కిస్తోన్న మాధవన్..ఫస్ట్ లుక్ రిలీజ్
హీరో మాధవన్( Madhavan) వరుస లవ్ స్టోరీ సినిమాలు చేసి లవర్ బాయ్ అనిపించుకున్నాడు. అప్పట్లో మాధవన్ ఏ సినిమా చేసినా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. ముఖ్యంగా యూత్ ఎగబడి మరీ మాధవన్ సినిమాకు వెళ్లేవారు. అలాంటి మాధవన్ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్‌నే చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇస్రో శాస్త్రవేత్త అయిన నంబినారాయణన్(Nambi Narayanan) జీవిత కథతో రాకెట్రీ(Rocketry) అనే సినిమాను మాధవన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో నంబినారాయణన్ పాత్రలో మాధవన్ నటిస్తూ స్వీయ దర్శకత్వం(Direction) వహించారు.

గత ఏడాది రాకెట్రీ సినిమా(Rocketry Movie) విడుదలై మంచి విజయం అందుకుంది. రూ.25 కోట్లతో ఆ సినిమాను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తాజాగా మాధవన్(Madhavan) మరో బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో తమిళ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన గోపాలస్వామి దొరస్వామి నాయుడు(Gopalswamy Doraiswamy Naidu) బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు. జీడీ నాయుడు ఇండియాలోనే ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌ని కనిపెట్టి రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్(First Look poster)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
మాధవన్(Madhavan) తెరకెక్కిస్తోన్న ఈ మూవీని మీడియా ఒన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రూపొందిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతోంది. ఈ బయోపిక్‌ను మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను, టెక్నీషియన్స్‌ను వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీనే కాకుండా మరో బయోపిక్‌లో కూడా మాధవన్(Madhavan) నటిస్తున్నట్లు సమాచారం. ప్రఖ్యాత లాయర్ సి శంకరన్ నైర్ బయోపిక్‌లో కూడా మాధవన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన రానుంది.
జీడి నాయుడు బయోపిక్ సినిమాపై మాధవన్ చేసిన ట్వీట్:
Thank you so much. Working on the team . Krishna Kumar will be helming the project bro. Rest of the cast not finalized. ❤️❤️🙏🙏 https://t.co/lmSEXeZfdp
— Ranganathan Madhavan (@ActorMadhavan) April 7, 2023