బాలీవుడ్ రూమర్డ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్(Tiger Shroff), దిశా పటానీ. ఈ జంట డేటింగ్ లో ఉందని చాలా కాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. చాలా సార్లు ఈ జంట జంటగా మీడియా ముందుకు చిక్కారు. అయితే, ఎన్నిసార్లు ప్రశ్నించినా , వీరు మాత్రం తాము ప్రేమలో ఉన్నామని కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం లేదు.కొంతకాలం క్రితం టైగర్ ష్రాఫ్ కాఫీ విత్ కరణ్ (Coffee with Karan) ప్రోగ్రామ్ కి హాజరయ్యాడు. ఆ సమయంలో కరణ్ తనని ఇదే విషయం పై ప్రశ్నించగా, తాను సింగిల్ అంటూ సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.
అయితే, తాజాగా ఈ జంట మీడియా కంట చిక్కారు.గత శనివారం, ఇద్దరు తారలు ఢిల్లీలో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈవెంట్ కి జంటగా హాజరైన వీరు, కలిసి మాట్లాడుకుంటూ ఫోటోగ్రాఫర్ల కంట పడ్డారు.దీంతో, ఈ ఫోటోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారాయి. టైగర్ ష్రాఫ్ బ్లాక్ టీ-షర్ట్, ప్యాంట్, షూస్ ధరించి ఉండగా, దిశా పటానీ(Disha Patani) క్రాప్ టాప్, వైట్ ప్యాంట్ , స్నీకర్స్తో కనిపించింది. ఈ ఫోటోలకు ముందు వీరిద్దరూ విమానంలో కలిసి ప్రయాణించిన వీడియోలు కూడా బయటకు రావడం విశేషం.కాగా, వీరిద్దరూ తమ మధ్య ఎలాంటి బంధం లేదు అని చెబుతూనే కలిసి తిరుగుతున్నారు. దీంతో, కచ్చితంగా వీరు డేటింగ్ లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.