Pension for those who will not get married soon.. Haryana state new scheme
వృద్ధాప్య, వితంతు పింఛన్(Pension) లు తెలుసు కానీ పెళ్లి కాని వారికి కూడా పింఛన్ ఇస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచన బాగుంది కదా. అందుకే హర్యానా రాష్ట్రం ఈ వినుత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టబోతోంది. పెళ్లి కాని 45-60 మధ్య వయసు ఉన్న వారికి పింఛన్ ఇచ్చేలా హర్యానా ప్రభుత్వం(Haryana Government) ఓ కొత్త సంక్షేమ పథకాన్ని(welfare scheme) ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) తెలిపారు. రాబోవు నెల రోజుల లోపు ఈ పథకంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
కర్నాల్ లో జరిగిన జన్ సంవద్ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో ఓ 60 ఏళ్ల వృద్దుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ కు దరఖాస్తు చేసుకోవాడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందని తెలిపారు. అనంతరం సీఎం (Manohar Lal Khattar) మాట్లాడుతూ… 45 సంవత్సరాలు పై బడిన పెళ్లి కాని స్త్రీ, పురుషులు అందరికి నెలవారి పింఛన్ వచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పారు. నెల రోజుల్లోగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సీఎం తెలిపారు. ఇక వృద్ధాప్య పింఛన్ ను కూాడా వచ్చే ఆరు నెలల్లో 3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.అయితే పెళ్లి కాని వారికి ఎంత పింఛన్ ఇస్తారు. ఆ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి లాంటి విషయాలను సీఎం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.