Rajiniతో లోకేష్‌కు ఇష్టం లేదా? సీక్వెల్స్ సంగతేంటి?
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో సినిమా చేయడం ఇష్టం లేదా? మరి ఇప్పటికే కమిట్ అయిన సీక్వెల్స్ కథేంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి లోకేష్ ఏం చెబుతన్నాడు?
Rajini: రీసెంట్గా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని.. ఏకంగా 600 కోట్ల వసూళ్లను రాబట్టి తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు సూపర్ స్టార్. ఇక ఈ సినిమా తర్వాత రజినీకాంత్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. 170వ చిత్రాన్ని ‘జై భీమ్’ ఫేం టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నాడు. కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తోన్న ‘లాల్ సలామ్’ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు రజినీ. ఇక ఇప్పుడు రజినీకాంత్ 171వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం విజయ్‌తో ‘లియో’ సినిమా తెరకెక్కిస్తున్నాడు లోకేష్. వచ్చే దసరాకు లియో రిలీజ్ కానుంది.
ఈలోపే లోకేష్, రజనీ ప్రాజెక్ట్ ఎందుకు అనౌన్స్ అయ్యింది అనేదే? అందరి డౌట్. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లోకేష్ కూడా లియో సినిమా రిలీజ్ తర్వాతే తలైవా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఉంటే బాగుండేది.. అనే ఫీలింగ్‌లో ఉన్నాడట. ఈ విషయంలో లోకేష్ కాస్త అప్సెట్ అయ్యాడని కోలీవుడ్ వర్గాల మాట. ఇక ఎలాగూ అనౌన్స్మెంట్ వచ్చేసింది కాబట్టి.. ఈ చర్చ అనవసరమనే చెప్పాలి. లోకేష్ కమిట్ అయిన సీక్వెల్స్ సంగతేంటి? అనేదే మరో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే ఖైదీ సీక్వెల్, విక్రమ్ సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు లోకేష్. ఇప్పుడు రజనీతో ప్రాజెక్ట్ ప్రకటించడంతో.. సీక్వెల్స్ పరిస్థితేంటి? అని అడుగుతున్నారు నెటిజన్స్. ఖైదీ, విక్రమ్ సినిమాల సీక్వెల్స్ కోసం తమిళ తంబీలే కాదు.. తెలుగు ఆడియెన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. దీంతో కార్తీ అభిమానులు, కమల్ అభిమానులు లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇవే కాదు.. ఈ మధ్య ఓ ఇంటర్య్వూలో సూర్యతో రోలెక్స్ రోల్లో ఫుల్ మూవీ చేస్తానని చెప్పాడు. దీంతో.. ఇలాంటి వాటికి లోకేష్ ఏం చెబుతాడనేది ఆసక్తికరంగా మారింది.