పూరీ జగన్నాథ్(puri jagannadh) అంటేనే డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన పూరి.. బ్లాక్ బస్టర్లతో పాటు ఘోరమైన డిజాస్టర్స్ కూడా ఇచ్చాడు. అయితే ఫ్లాప్స్ వచ్చిన సమయంలో.. ఇక పూరీ పనైపోయిందని అనుకున్న ప్రతీసారి.. సాలిడ్‌గా కమ్ బ్యాక్ అవుతునే ఉన్నాడు. ఇప్పుడు కూడా పూరి అదే పనిలో ఉన్నాడు. కానీ లైగర్ ఎఫెక్ట్ కాస్త ఎక్కువగానే ఉంది. మామూలుగా ఆరు నెలల్లో సినిమాలు పూర్తి చేసే పూరి.. లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని తీసుకున్నాడు.
ఇదే పూరిని దెబ్బేసిందని చెప్పొచ్చు. పూరి తనదైన ఫార్మాట్లో సినిమా చేసి ఉంటే.. కనీసం బడ్జెట్ అయినా కంట్రోల్ అయి ఉండేది. ఇంతలా ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదు. ఇక ఇప్పుడు లైగర్ వ్యవహారం మరింత ముదిరేలా చేసింది. లైగర్ నష్టాల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు.. ఓ ఆడియో క్లిప్ ద్వారా పూరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇంకో అడుగు ముందుకు వేశాడు. తనను ఇద్దరు వ్యక్తులు బెదిరిస్తున్నారని.. ప్రస్తుతం తాను ముంబాయిలో వుంటున్నానని.. వాళ్ల వల్ల తన కుటుంబానికి హాని ఉందని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అయితే ఆ ఇద్దరు మరెవరో కాదు.. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ కావడం విశేషం. గతంలో పూరిని పొగడ్తలతో ముంచెత్తాడు వరంగల్ శ్రీను. ఇక ఆడియో క్లిప్‌లో శోభన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడాడు పూరి. కానీ ఇప్పుడు వాళ్ల పైనే కంప్లైంట్ ఇచ్చాడు. ఈ లెక్కన చూస్తే.. ధర్నా టాపిక్‌తో పూరి కాస్త గట్టిగానే హర్ట్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఇంత జరుగుతున్నా పూరితో పాటే ట్రావెల్ చేస్తున్న సహా నిర్మాత చార్మీ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించడం లేదు. లైగర్ నష్టాలను పూరినే డీల్ చేస్తున్నాడు. కాబట్టి తెరవెనక ఏం జరుగుతుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మరి లైగర్ వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.