మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. మల్టీఫ్లెక్స్ లో సినిమా చూడాలనుకునేవారికి శుభవార్త. తక్కువ ధరకే సినిమా చూసే బంపరాఫర్ ను పీవీఆర్ సినిమాస్ సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. జనవరి 20వ తేదిన సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ బంపరాఫర్ పీవీఆర్ సినిమాస్ తెచ్చింది. ఆ రోజు అన్ని షోలను కేవలం రూ.99లకే చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే ప్రతి టికెట్ కు జీఎస్టీ అనేది అదనంగా ఉంటుందని ప్రకటించింది.
అయితే ఈ ఆఫర్ ప్రతి చోటా ఉండదని, కొన్ని నగరాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. చండీగఢ్, పఠాన్ కోట్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఈ ఆఫర్ పనిచేయదని పీవీఆర్ సినిమాస్ తెలిపింది. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని నగరాల్లో టిక్కెట్ ధరను రూ.100లతో పాటుగా జీఎస్టీని కూడా కలపనుంది. అయితే తెలంగాణలో మాత్రం రూ.112 టికెట్ తో పాటు జీఎస్టీ యాడ్ అవ్వనుంది. రిక్లైనర్, ఐమాక్స్, 4డీఎక్స్ వంటి ప్రీమియం కేటగిరీ సీట్లకి ఈ ఆఫర్ వర్తించదు. అదేవిధంగా జనవరి 20వ తేది మాత్రమే ఈ బంపరాఫర్ వర్తిస్తుందని పీవీఆర్ సినిమాస్ తెలిపింది.