dulquer salmaan: దుల్కర్ సల్మాన్.. టాలీవుడ్ కి అస్సలు పరిచయం అవసరం లేని పేరు. విలక్షణమైన కథల్ని ఎంచుకుంటూ క్రేజీ హీరోగా ప్రత్యేకతను చాటుకుంటున్నారు దుల్కర్ సల్మాన్. తెలుగులో `మహానటి`, సీతారామం వంటి సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. అభిలాష్ జోషీ దర్శకత్వంలో `కింగ్ ఆఫ్ కోత` మూవీని దుల్కర్ సల్మాన్ చేస్తున్నారు.
గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా హీరో దుల్కర్ జీ స్టూడియోస్‌తో కలిసి వే ఫేరెర్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తూ నటిస్తున్నారు. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటిస్తుండగా, రీతూ సింగ్ కీలక అతిథి పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీని ఆగష్టు 23న మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో కొంత భాగాన్ని మళ్లీ రీ షూట్ చేయాలని భావిస్తున్నారట. మూవీ క్లైమాక్స్ విషయంలో దుల్కర్ చాలా అసంతృప్తిగా ఉన్నాడట. మళ్లీ రీషూట్ చేయాలని అనుకుంటున్నారట. మే నెలలో చిత్రీకరించిన ఒరిజినల్ క్లైమాక్స్ చాలా ఇంటెన్స్, పవర్ ఫుల్ గా చిత్రీకరించారు. నిజానికి క్లైమాక్స్ చిత్రీకరణకు ప్రత్యేకంగా సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్‌ని రప్పించగా, కస్టడీలో యాక్షన్ సన్నివేశాల్లో పనిచేసిన మహేష్ మాథ్యూ ఈ సినిమా క్లైమాక్స్‌కి కూడా పనిచేశారు. నిమిష్ రవి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చేశారు. క్లైమాక్స్ అవుట్ పుట్ ఛూసి దుల్కర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో, మళ్లీ రీ షూట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 80, 90ల నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రంలో ప్రసన్న, గోకుల్ సురేష్, చెంబన్ వినోద్ జోస్, షమ్మి తిలకన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.